War 2: ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌… కొత్త పాయింట్‌ పట్టుకొచ్చిన ప్రచార కమిటీ!

  • April 8, 2024 / 09:20 PM IST

‘వార్‌ 2’లో తారక్‌ (Jr NTR)  నటిస్తున్నాడు, ‘వార్‌ 2’లో తారక్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది, ‘వార్‌ 2’లో తారక్‌ విలన్‌ కాదు, ‘వార్‌ 2’లో తారక్‌ త్వరలో ఎంట్రీ ఇస్తాడు! ఏంటివి ఇన్నిసార్లు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇవన్నీ మేం చెప్పినవి కావు ‘సమాచారం’ అంటూ గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలివి. ప్రతిసారి ‘తారక్‌ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటాడు?’ అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా ఇలాంటి ఓ వార్తను రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

హృతిక్ రోష‌న్‌ (Hrithik Roshan) – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా తెరకెక్కిస్తున్నారు. హృతిక్‌ ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్‌ అవ్వగా… తారక్‌ ఈ నెలలో జాయిన్‌ అవుతాడు అని అంటున్నారు. ఈ మేరకు ఓ రెండు వారాలు శిక్షణ తీసుకొని సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు అని ఇటీవల ఓ వార్త బయటకు వదిలారు. ఆ లెక్కన రంజాన్‌ తర్వాత తారక్‌ ముంబయి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక్కడే శిక్షణ తీసుకుంటాడు అనే చర్చ కూడా నడవడమే దీనికి కారణం.

ఈ విషయంలోనే క్లారిటీ రాక, సినిమాకు సంబంధించి సరైన అనౌన్స్‌మెంట్‌ లేక, షూటింగ్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనక, ‘దేవర’ (Devara) లుక్‌లో ‘వార్‌ 2’ షూటింగ్‌ అనే డౌట్‌ ఉన్నప్పుడు… కొత్తగా మరో పుకారు పట్టుకొచ్చారు. దాని ప్రకారం ఈ సినిమాలో తారక్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. అవును ఈ సినిమాలో ఇద్దరు తారక్‌లు కనిపిస్తారు అని తారక్‌ సన్నిహితులు, అతని ప్రచార కమిటీ అంటోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ఇదంతా ఓ పక్క నడుస్తుంటే మరో పక్క ‘ముందు షూటింగ్ ప్రారంభించడిరా సామి’ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ లీకులతో సంతృప్తిపడాలి. త్వరగా షూటింగ్‌ ప్రారంభిస్తే హ్యాపీగా ఫీల్‌ అవుతాం అని అంటున్నారు నెటిజన్లు. మరి తారక్‌ టీమ్‌ ఈ విషయాల మీద ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus