Pushpa 2 Teaser: పుష్ప ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్.. అంతే..!

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(ది రైజ్) (Pushpa) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి. నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆగస్టు 15 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది అని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈరోజు అనగా ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ‘పుష్ప 2 ‘ టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే ఇది.. 1 :08 నిమిషాల నిడివి కలిగి ఉంది.ముందు నుండి చెప్పుకున్నట్టు గంగాళమ్మ జాతరని హైలెట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు.

అల్లు అర్జున్ నీలం రంగు చీరలో గంగాళమ్మ తల్లి ఆవహించినట్టు ముస్తాబయ్యి శత్రు సంహారం చేయడాన్ని ఇందులో చూపించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన నేపధ్య సంగీతం టీజర్ కే హైలెట్ గా నిలిచింది. మీరోస్లా కూబా బ్రోజెక్ (Miroslaw Kuba Brozek) సినిమాటోగ్రఫీ కూడా సూపర్ అనిపించేలా అంటుందని టీజర్లోని విజువల్స్ చూస్తే స్పష్టమవుతుంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus