ఆర్ఆర్ఆర్ నుంచి మరో పోస్టర్ రిలీజ్ కానుందా..?

  • March 29, 2021 / 12:31 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు సినిమా ప్రమోషన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. విడుదలకు కొన్ని నెలల ముందే సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమా విడుదల నాటికి భారీగా అంచనాలను పెంచేస్తారు. రాజమౌళి సినిమాలపై అంచనాలు పెరిగినా ఆ అంచనాలను సునాయాసంగా అందుకునేలా రాజమౌళి కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామరాజు లుక్ విడుదల కావడంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ లుక్ రిలీజ్ కావడంతో భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా మే 20న ఎన్టీఆర్ లుక్ రిలీజ్ కానుంది. అయితే రాజమౌళి మరో మూడు రోజుల్లో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగణ్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల గురువుగా కనిపించనుండగా ఆయన భార్య పాత్రలో శ్రియ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి మరో పోస్టర్ రిలీజ్ అవుతున్నట్టు వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కుల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రాజమౌళి దసరా పండుగకు ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా ప్రణాళికను రూపొందించుకున్నారని సమాచారం. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus