ఆ ట్యాలెంటెడ్ హీరోకి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయిన రవితేజ..!

Advertisement

రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం షూటింగ్ కొంత భాగం బ్యాలన్స్ ఉంది. త్వరలోనే దానిని ఫినిష్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేని పక్షంలో అది సాధ్యమేనా అనే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. రవితేజ మాత్రం ‘క్రాక్’ ఫినిష్ చేసిన వెంటనే.. తన తరువాతి చిత్రం షూటింగ్లో కూడా జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాడు.

‘రైడ్’ ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ర‌మేష్ వ‌ర్మ డైరెక్షన్లో రవితేజ ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించనున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. అంతేకాకుండా కథ ప్రకారం ఈ చిత్రంలో మ‌రో యంగ్ హీరోకి కూడా ఛాన్స్ ఉందట.ఆ యంగ్ హీరో పాత్ర కోసం శ్రీ‌విష్ణు లేదా స‌త్య‌దేవ్ లను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

అయితే శ్రీవిష్ణు ఇప్పుడున్న ఫామ్లో వేరే హీరో సినిమాల్లో చిన్న పాత్రలు చేసే అవకాశం లేదు. దాంతో సత్యదేవ్ నే ఫిక్స్ చేసే ప్రయత్నాలు చెయ్యమని రవితేజ దర్శకనిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తుంది. నవంబర్ నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుందని సమాచారం.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus