RRR Movie: తారక్ పుట్టినరోజున మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్..?

  • May 6, 2021 / 05:38 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి గత కొన్ని నెలల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్లను, టీజర్లను హీరోల పుట్టినరోజుల సందర్భంగా, ప్రత్యేక దినాల్లో రిలీజ్ చేస్తూ సినిమాలపై భారీగా అంచనాలు పెంచుతున్న సంగతి తెలిసిందే. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రలోని చరణ్ లుక్ రివీల్ కాగా తారక్ పుట్టినరోజున ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఫ్యాన్స్ కోసం ఏకంగా రెండు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

తారక్ పుట్టినరోజున కొమరం పాత్రలో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ కావడంతో పాటు ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ సన్నివేశాలకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో రెండు వారాల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆరోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారని తెలిసి చరణ్ ఫ్యాన్స్ కూడా మే 20వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఈ టీజర్ లో రాజమౌళి రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారనుందని గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఆ వార్తలకు చెక్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వాయిదా పడనుందని సమ్మర్ కు వాయిదా పడనుందని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలకు సంబంధించి రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్ తో స్పష్టతనివ్వనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus