‘అంతరిక్షం’ లో లావణ్య త్రిపాఠి పాత్ర

  • December 8, 2018 / 04:34 PM IST

‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ పతాకం పై ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అంతరిక్షం 9000 KMPH’. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ‘దేవ్’ పాత్రలో కనిపిస్తుండగా.. అదితీ ‘రియా’ అనే పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఇక లావణ్య త్రిపాఠి .. పార్వతి టీచర్ పాత్రలో కనిపించబోతుంది.

తాజాగా లావణ్య త్రిపాఠి పాత్రకు సంబంధించి ఒక ఆడియో క్లిప్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘అంతరిక్షం 9000 KMPH’ చిత్రం లో “ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కూతురిగా మాత్రమే కాకుండా .. పార్వతి టీచర్ గా నాకు గుర్తింపు ఉందంటుంది లావణ్య. గోల్ ఓరియెంటెడ్ అండ్ ఇండిపెండెంట్ పీపుల్ అంటే నాకు ఇష్టం…. నా 24 యేళ్ళ జీవితంలో మా నాన్నలాంటి వ్యక్తిని చూడగలనా అనుకున్నాను .. ఇప్పటికి చూశాను. దేవ్ కి దేశం మీద ఎంత ప్రేమ వుందో .. తనపై నాకు అంత ప్రేమ వుంది” అంటూ లావణ్య త్రిపాఠి చెప్పిన డైలాగ్స్ ఆమె పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ .. సినిమాపై ఆసక్తిని

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus