అను అంత త్వరగా పూర్తి చేసిందా

అను ఎమ్మాన్యూల్ హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టి రెండేళ్లవుతుంది. మలయాళ చిత్రం ‘యాక్షన్ హీరో బిజూ’ ద్వారా వెండితెరకు పరిచయమైన అను ఎమ్మాన్యూల్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా “మజ్ను, డిటెక్టివ్, అజ్ణాతవాసి” చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకొని అందరి చూపు తనవైపుకు తిప్పుకొన్న అను ఎమ్మాన్యూల్ చేతిలో ప్రస్తుతం నా పేరు సూర్య, శైలజా రెడ్డి ఎన్టీయార్ 28వ చిత్రం ఉన్నాయి. అయితే.. ఆమె తాజా చిత్రం “అజ్ణాతవాసి”లో అను ఎమ్మాన్యుల్ రోల్ పెద్దగా ఆకట్టుకొనే స్థాయిలో లేదు. పైగా రెండు పాటల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి పిచ్చి స్టెప్పులు వేయడం మినహా ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. దాంతో ఆమె పాత్రను ఎంతగానో ఊహించుకొని థియేటర్ కి వచ్చిన అభిమానులందరూ షాక్ అయ్యారు.

ఇప్పుడు ఆమె సరికొత్త చిత్రం “నా పేరు సూర్య” సినిమాలో ఆమె రోల్ కు అంతగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె ఈ సినిమా కోసం వెచ్చించింది కేవలం 15 రోజులు మాత్రమే. 15 రోజుల్లో పాటలు, సన్నివేశాలు ఎన్ని షూట్ చేస్తారు చెప్పండి. సో “నా పేరు సూర్య”లో కూడా అను ఎమ్మాన్యూల్ ది చాలా చిన్న రోల్ అని తెలుస్తోంది. ఇకనైనా అను ఎమ్మాన్యుల్ గ్లామర్ తోపాటు పెర్ఫార్మెన్స్ మీద కూడా కాన్సన్స్ ట్రెషన్ చేస్తే బెటర్. లేదంటే.. మహా అయితే మరో పది సినిమాలు చేసి గుడ్ బై చెప్పాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus