కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తరువాత ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. చాలా వరకు గ్లామర్ డోస్ పెంచకుండా ఒక పరిధిలోనే సినిమాలు చేసే ఈ నటి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అయితే నెవర్ బిఫోర్ అనేలా హావభావాలను చూపించింది. మలయాళం సినిమాలో అమ్మడు ఏకంగా బూతులతో రెచ్చిపోయింది. అందుకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ మొదట ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ అందుకొని
ఆ తరువాత త్రివిక్రమ్ అఆ సినిమాతో హిట్ అందుకొని వరుసగా అవకాశాలు అందుకుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఈ బ్యూటీ బిజీగా కనిపిస్తోంది. ఇక ఇటీవల ఫ్రీడమ్ @మిడ్ నైట్ అనే మలయాళం షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అందులో అనుపమ కాస్త బోల్డ్ గా కనిపించేందుకు ప్రయత్నం చేసినట్లు అర్ధమయ్యింది. ఆ లఘు చిత్రం భార్య భర్తల మధ్య జరిగే స్టోరీ అని తెలుస్తోంది. హక్కిం షాజహాన్ మెయిన్ లీడ్ లో నటించాడు.
నా కోసం ఎవరినైనా చంపుతావా అంటూ కసిగా మాట్లాడిన అనుపమ ఆ వెంటనే బుతులతో కూడా షాక్ ఇచ్చింది. F*CK యూ అంటూ చాలా బోల్డ్ గా హావభావాలను చూపించింది. చూస్తుంటే ఈ షార్ట్ ఫిల్మ్ తో అమ్మడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది.
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!