Anushka: బాలయ్యకు భారీ షాకిచ్చిన అనుష్క.. ఏం జరిగిందంటే?

  • June 10, 2023 / 12:41 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కకు ఫ్యాన్స్ లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ బ్యూటీ నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నవీన్ పోలిశెట్టికి, అనుష్కకు మరో భారీ సక్సెస్ ను అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

యోగా అనేది నాకు తెలియకపోతే నేను (Anushka) కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండేదానినని ఆమె చెప్పుకొచ్చారు. గోపీచంద్, రవితేజ, మహేష్ బాబులలో కంఫర్టబుల్ కో స్టార్ ఎవరనే ప్రశ్నకు అనుష్క స్పందిస్తూ రవితేజ అని కామెంట్లు చేశారు. నా సినిమాలలో నాకు బాగా నచ్చిన మూవీ అరుంధతి అని నచ్చని మూవీ ఒక్క మగాడు అని ఆమె అన్నారు.

బాలయ్యతో కలిసి నటించిన సినిమా తనకు నచ్చలేదని చెప్పి నందమూరి ఫ్యాన్స్ కు అనుష్క ఒకింత షాకిచ్చారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో ఒకేసారి ఛాన్స్ వస్తే తారక్ తో కలిసి నటిస్తానని ఆమె అన్నారు. నేను చాలాసార్లు పెళ్లి జరిగిందని ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయని అనుష్క చెప్పుకొచ్చారు. నా కో స్టార్స్ ను పెళ్లి చేసుకున్నానని వార్తలు వినిపించాయని ఆమె తెలిపారు.

సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్ లతో నాకు పెళ్లి జరిగినట్టు ప్రచారం చేశారని ఆమె తెలిపారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన ఈ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. అనుష్క రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో అనుష్క పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus