అనుమతి లేకుండా ఫోటోలు.. మండిపడుతోన్న హీరోయిన్!

  • January 7, 2021 / 01:46 PM IST

సినీ సెలబ్రిటీలు బయటకొస్తే చాలు.. ఫోటోల కోసం ఎగబడుతుంటారు జనాలు. ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫొటోగ్రాఫర్లు తన కెమెరాను క్లిక్ చేస్తూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు వారి ప్రవర్తన సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతుంటుంటుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, హీరోయిన్ అనుష్క శర్మకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. బుధవారం నాడు ఆమె, తన భర్తతో బయటకి వెళ్లొచ్చారు. అనంతరం విరాట్ తో బాల్కనీలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోను అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ఆమె తీయించుకున్నది కాదు. ఎవరో ఫోటోగ్రాఫర్ అనుష్క, విరాట్ ల ఫోటోను అనుమతి లేకుండా తీసి తమ పబ్లికేషన్ కోసం వాడుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ పబ్లికేషన్ మీద, ఫోటోగ్రాఫర్ మీద మండిపడింది అనుష్క. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా..? అని ప్రశ్నించింది. పదేపదే మా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు.

ఇక చాలు.. ఇలాంటివి వెంటనే ఆపండి అంటూ ఘాటుగా హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మరికొద్దిరోజుల్లో అనుష్క తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆరోజు కోసం అనుష్క దంపతులతో పాటు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus