టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కాస్త లాంగ్ బ్రేక్ ఇచ్చారని చెప్పాలి. బాహుబలి వంటి క్రేజీ ప్రాజెక్టు తర్వాత ఈమె నిశబ్దం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకు ఆదరణ పొందలేకపోయింది. ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వని అనుష్క ప్రస్తుతం యు వి క్రియేషన్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అనుష్క ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా అనుష్క ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తాను నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి అని ప్రశ్నించడంతో తనకు అరుంధతి సినిమా వేదం సినిమా చాలా ఇష్టమని తెలియజేశారు.
ఈమె (Anushka) ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే మీకు నచ్చిన సినిమా ఏది అని ప్రశ్నించగా బాలయ్యతో కలిసి నటించిన ఒక్క మగాడు సినిమా తనకు ఏమాత్రం నచ్చదు అంటూ అనుష్క చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి. ఇలా బాలయ్యతో సినిమా చేయడమే కాకుండా ఆ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదంటూ అనుష్క నిర్మొహమాటంగా చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక మీ గురించి సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ ఏంటి అని అడగడంతో ఈమె మాట్లాడుతూ నాకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏకంగా ఐదు మంది హీరోలతో తనకు పెళ్లిళ్లు చేశారు అంటూ అనుష్క నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇదే తన గురించి వచ్చిన పెద్ద గాసిప్ అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ హీరోలు ఎవరు ఏంటి అనే విషయానికొస్తే గోపీచంద్, ప్రభాస్, సుమన్, సెంథిల్, అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు