స్టార్ హీరోయిన్ అనుష్క కొన్నేళ్ల క్రితం సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల్లోనే సులువుగా బరువు పెరిగిన అనుష్క బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. అనుష్క నటించి గతేడాది అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన నిశ్శబ్దం సినిమా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బరువు తగ్గడానికి అనుష్క డైటీషియన్ సూచనలను పాటిస్తున్నారని తెలుస్తోంది. స్లిమ్ గా మారాలనే ఉద్దేశంతో అనుష్క నీళ్లను ఎక్కువగా తీసుకుంటారని సమాచారం. రోజులో ఎక్కువగా కొబ్బరినీళ్లను కూడా తీసుకుంటున్నారని కొబ్బరినీళ్ల వల్ల చర్మం మెరుస్తుందని ఆమె చెబుతున్నారని తెలుస్తోంది. ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయలు మెనూలో ఉండే విధంగా స్వీటీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. ఇంట్లో చేసిన ఆహారానికే అనుష్క ప్రాధాన్యత ఇస్తున్నారని బయటి ఆహారంపై అనుష్క ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
రాత్రి 8 గంటల లోపే డిన్నర్ చేయాలని అనుష్క రూల్స్ పెట్టుకున్నారని ఒకేసారి తీసుకోకుండా రోజులో 5 నుంచి 6 సార్లు ఆహారం తీసుకోవాలని ఆమె భావిస్తున్నారని సమాచారం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు, నూనెతో తయారు చేసిన పదార్థాలకు అనుష్క దూరంగా ఉన్నారని సమాచారం. యోగా, వ్యాయామం ద్వారా అనుష్క బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. అనుష్క తరువాత సినిమాలో సన్నగా కనిపిస్తారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!