Anushka: దేవదాసి పాత్రలో అనుష్క.. ఒప్పుకుంటుందా?

Advertisement

వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరోసారి మెగా ఫోన్ పట్టుకోవాలని చూస్తున్నారు. 90 ఏళ్ల ఈ దర్శకుడికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదేంటంటే.. ‘బెంగుళూరు నాగరత్నమ్మ’ బయోపిక్. ఆమె ఒక దేవదాసి. ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయాలని భావిస్తున్నారు సింగీతం శ్రీనివాసరావు. నాగరత్నమ్మ లైఫ్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కమర్షియల్ గా కూడా ఇదొక స్ట్రాంగ్ సబ్జెక్ట్. అందుకే సినిమాగా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Click Here To Watch Now

కథ కూడా రెడీగా ఉంది. టాలీవుడ్ లో స్టార్ రచయితగా పేరొందిన సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది. ముందుగా ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించమని సమంతని అడిగారు. పూర్తి కథను కూడా వినిపించారు. అయితే ఈ సినిమా చేయాలా..? వద్దా..? అనే విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీంతో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ను అనుష్కకి వినిపించారు.

అనుష్కకి కథ నచ్చినప్పటికీ.. ఆమె కొంత సమయం కావాలని అడిగిందట. నాగరత్నమ్మ పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుంది. కాకపోతే ఇదొక అగ్రెసివ్ రోల్. ఇందులో స్టార్ హీరోయిన్ నటిస్తేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. అందుకే అనుష్క, సమంతల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా గడుపుతోంది. ‘యశోద’ సినిమాలో నటిస్తోన్న ఆమె మరో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేసింది.

మరోపక్క అనుష్క.. ‘నిశ్శబ్దం’ తరువాత చాలా గ్యాప్ తీసుకుంది. నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. మరి సింగీతం శ్రీనివాస్ ప్రాజెక్ట్ కి ఓకే చెబుతుందేమో చూడాలి!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news