ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!

  • March 10, 2022 / 11:02 AM IST

సినిమాల్లో నటీనటుల పాత్రలు ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక సినిమాలో ఓ నటుడికి భార్యగా కనిపించిన నటి మరో సినిమాకి వచ్చేసరికి వదిన అవ్వొచ్చు,అలాగే ఒక సినిమాలో భార్యగా కనిపించే ఆమె మరో సినిమాలో అక్కగా కనిపించవచ్చు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ‘సంక్రాంతి’ సినిమాని తీసుకోండి. ఇందులో స్నేహ.. శ్రీకాంత్ కు వదినగా కనిపించింది. ఆ వెంటనే వచ్చిన ‘రాధా గోపాలం’ లో భార్యగా నటించింది. అంతకు ముందు ‘ఖడ్గం’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

Click Here To Watch Now

ఇక ప్రకాష్ రాజ్- జయసుధ లు చాలా సినిమాల్లో భార్యా భర్తలుగా కనిపించారు కానీ పరుగు, సోలో సినిమాల్లో అక్కా తమ్ముడు, చెల్లి – అన్న అన్నట్టు నటించారు. ‘బద్రి’ లో పవన్ కళ్యాణ్ కు బావమరిదిగా కనిపించిన ప్రకాష్ రాజ్ ‘జల్సా’ లో మామగారుగా కనిపించాడు. సినిమా.. సినిమాకి నటీనటుల పాత్రల వేషధారణ అనేది మారుతూనే ఉంటుంది. ఇదే విడ్డూరం అనుకుంటే హీరోయిన్లు కూడా తండ్రీ కొడుకులతో లేదా ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు జోడీగా నటించి ఆశ్చర్యపరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ హీరోయిన్లు ఎవరు.. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కాజల్ :

మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చరణ్ కు జోడీగా నటించిన ఈమె తర్వాత అతని తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ లో హీరోయిన్ గా నటించింది. ‘ఆచార్య’ లో కూడా నటిస్తుంది. అంతేకాదు చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు జోడీగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కూడా నటించింది.

2) నయన తార :

‘లక్ష్మీ’ ‘తులసి’ ‘బాబు బంగారం’ లో వెంకీ సరసన నటించిన నయన్… ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లో రానాకి జోడీగా కూడా నటించింది.

3) భూమిక :

సుమంత్ కు జోడీగా యువకుడు సినిమాలో నటించిన భూమిక, ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాలో నాగ్ కు జోడీగా కూడా నటించింది. ఈ మూవీలో సుమంత్ కూడా నటించాడు లెండి.

4) శ్రీదేవి :

ప్రేమాభిషేకం, శ్రీమంతుడు, శ్రీరంగనీతులు సినిమాలో ఏఎన్నార్ కు జోడీగా నటించిన శ్రీదేవి.. ‘ఆఖరి పోరాటం’ ‘గోవిందా గోవిందా’ చిత్రంలో అయన తనయుడు నాగార్జునతో కూడా కలిసి నటించింది.

5) లావణ్య త్రిపాఠి :

నాగ్ సరసన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య.. అతని తనయుడు చైతన్యతో యుద్ధం శరణంలో కూడా నటించింది.

6) రకుల్ ప్రీత్ సింగ్ :

ఈమె కూడా చైతన్య సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లో నటించింది.. తర్వాత నాగ్ సరసన ‘మన్మధుడు2’ లో కూడా నటించింది.

7) తమన్నా :

‘రచ్చ’ లో చరణ్ కు జోడీగా నటించింది.. ‘సైరా’, ‘భోళా శంకర్’ లో చిరు సరసన కూడా నటించింది.

8) సదా :

ఎన్టీఆర్ తో నాగ లో నటించింది.. తర్వాత వీరభద్రలో అతని బాబాయ్ కు జోడీగా కూడా నటించింది.

9) ఆర్తి అగర్వాల్ :

ఎన్టీఆర్ తో అల్లరి రాముడు లో నటించింది.. బాలకృష్ణతో పలనాటి బ్రహ్మనాయుడు లో కూడా నటించింది.

10) త్రిష :

‘దమ్ము’ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించింది, ‘లయన్’ లో బాలయ్యకి జోడీగా కూడా నటించింది.

11) శృతీ హాసన్ :

చరణ్ తో ఎవడు లో నటించింది, ఇప్పుడు చిరు- బాబీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

12) ప్రియమణి :

సుమంత్ తో రాజ్ సినిమాలో నటించింది, నాగ్ తో రగడ లో కూడా నటించింది.

13) జెనీలియా :

వెంకీతో సుభాష్ చంద్రబోస్ లో నటించింది, రానాతో నా ఇష్టం మూవీలో కూడా నటించింది.

14) శ్రీయ :

బాలయ్య తో చెన్నకేశవ రెడ్డి, గౌతమీ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల్లో నటించింది , ఎన్టీఆర్ తో నా అల్లుడు లో నటించింది.

15) అనుష్క :

సుమంత్ తో మహానంది, నాగ్ తో డాన్, ఢమరుఖం వంటి చాలా సినిమాల్లో కలిసి నటించింది.

16) సమంత :

చరణ్ తో రంగస్థలం, పవన్ తో అత్తారింటికి దారేది. ఈ రెండు కూడా ఇండస్ట్రీ హిట్స్ అవ్వడం విశేషం.

17) వేదిక :

కళ్యాణ్ రామ్ తో విజయదశమి, బాలయ్యతో రూలర్ సినిమాల్లో నటించింది.

18) సోనాల్ చౌహాన్ :

కళ్యాణ్ రామ్ తో షేర్, బాలయ్య తో లెజెండ్, రూలర్ లో నటించింది.

19) తాప్సి :

షాడో లో వెంకీతో, ఘాజిలో రానాతో నటించింది.

20) ఇలియానా :

జల్సాలో పవన్ తో నటించింది, జులాయిలో అల్లు అర్జున్ తో నటించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus