Star Actress: రొమాంటిక్ ఫోటోలతో.. డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నటి..!

  • August 22, 2023 / 07:30 PM IST

సినిమా వాళ్ళ పై డేటింగ్ రూమర్స్, ప్రేమ, పెళ్లి వంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. సినిమా వాళ్ళు కూడా చాలా వరకు ఫేమస్ అవ్వడం కోసం తోటి నటీనటులతో సన్నిహితంగా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళే మా పై వార్తలు రాసుకుంటున్నారు అంటూ సింపతీ కామెంట్లు చేస్తుంటారు. ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ అని చాలా మందికి తెలీదు. తెలిసేలోపు ఆ వాళ్లకి రావాల్సిన పాపులారిటీ వాళ్లకి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్నిక్ ఎక్కువగా బాలీవుడ్లో వాడుతూ ఉంటారు.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. బాలీవుడ్ బ్యూటీ బానితా సంధు అందరికీ సుపరిచితమే. వరుణ్ ధావన్ తో చేసిన ‘అక్టోబర్’ ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘సర్దార్ ఉదమ్’ ‘ఆదిత్య వర్మ'(తమిళ్) , సీ డబ్ల్యూ సిరీస్ పండోరలో కూడా ఈమె నటించి మెప్పించింది. ఇక బనితా సంధు ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ దిల్లాన్ తో ఈమె డేటింగ్ చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.

ముంబయిలో ఇటీవల రిలీజైన డాక్యు-సిరీస్ కి కూడా (Actress) బనితా సంధు హాజరైంది. అక్కడి హోటల్లో ఏపీ దిల్లాన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఈమె షేర్ చేయడం జరిగింది. ఇక అమృత పాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ఏపీ ధిల్లాన్ పంజాబీ లో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇండో-కెనడియన్ రాపర్ గా ఇతను భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఏపీ దిల్లాన్- బానితా సంధు ల రొమాంటిక్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus