ప్రస్తుతం సినిమాకు సరిహద్దులు చెరిగిపోయాయి భాషతో సంబంధం లేకుండా ఒక సినిమా అన్ని భాషలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇలా అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రం భాష భేదాలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సైతం ఈ విషయంపై భారీగా నేటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈయన భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా సినిమాలకు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా చెన్నైలో జరిగినటువంటి ఒక అవార్డు వేడుకలలో భాగంగా ఏఆర్ రెహమాన్ తో పాటు తన భార్య సైరా బాను కూడా పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో భార్యకు రెహమాన్ పెట్టినటువంటి కండిషన్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ అవార్డు వేడుకలలో భాగంగా రెహమాన్ భార్యని కూడా మాట్లాడాలని కోరగా ఆమె మాట్లాడటానికి మైక్ అందుకోగానే రెహమాన్ హిందీలో కాదు తమిళంలో మాట్లాడు అంటూ తనకు కండిషన్ పెట్టారు.
తనకు (Ar Rahman) తమిళం పెద్దగా రాదని చెప్పిన సైరా బాను తిరిగి ఇంగ్లీషులో మాట్లాడారు.అయితే ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ రెహమాన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ భార్య ఏ భాషలో మాట్లాడాలో మీరే డిసైడ్ చేస్తారా? తనకు ఇలా కండిషన్ లు పెట్టడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
మీరు హిందీ సినిమాలకు పనిచేసి, హిందీ పాటలు పాడి డబ్బులు సంపాదించవచ్చు కానీ హిందీలో మాత్రం మాట్లాడకూడదా? ఎందుకు మీకు హిందీ భాష అంటే అంత ద్వేషం?కనీసం మీ భార్యకు నచ్చిన భాషలో మాట్లాడే స్వేచ్ఛను కూడా తనకు కల్పించలేరా అంటూ తీవ్ర స్థాయిలో రెహమాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?