ఓ సినిమాలో నటించిన పాత్రను చూసి మరో సినిమాలో ఛాన్స్ ఇస్తారా? అంటే ఇస్తారు అనే చెప్పాలి. అలాగే ఓ సినిమాలో నటించిన పాత్ర, ఆ పాత్ర ఇంపార్టెన్స్‌ని చూసి మరో సినిమాలో ఇచ్చిన ఛాన్స్‌ను వెనక్కి వెళ్లిపోతుందా? దీనికి కూడా సమాధానం యస్ అనే వస్తుంది. ఈ రెండు విషయాలు చాలామంది నటులకు జరిగే ఉంటాయి. అలా తెలుగమ్మాయి అర్చనకు కూడా జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది.
అర్చనకు దక్కినట్టే దక్కని ఆ సినిమా ఛాన్స్ గురించి చెబుతూ ఏడ్చేసింది. ఎందుకంటే ఆ సినిమా దర్శకుడు బాపు. అవును ఓ సినిమాలో చిన్న పాత్ర చేయడం వల్లే బాపు సినిమాను మిస్ అయ్యింది అర్చన. అలా అని ఆమె చిన్న పాత్ర చేసిన సినిమా ఏమైనా చిన్నదా అంటే కాదు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష ఫ్రెండ్‌గా కనిపించింది అర్చన. అందులో పాత్రను చూసి తన సినిమాలో హీరోయిన్ అనుకున్న బాపు పక్కన పెట్టేశారట.
ఈ విషయంలో అర్చన మాట్లాడుతూ… నేనెవరిపైనా కంప్లైంట్ చేయడం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది అర్చన. అలాగే ‘శ్రీరామదాసు’ నాటి రోజుల గురించి మాట్లాడింది అర్చన. నాగార్జున, రాఘవేంద్రరావు, సుమన్ స్థాయి గురించి అప్పట్లో తనకు అంతగా తెలియదని, కానీ వాళ్లు తనను బాగా చూసుకునేవారని చెప్పింది. ఆ సినిమాలో తను సీత పాత్రలో నటించడానికి చిన్నతనంలో నేర్చుకున్న క్లాసికల్ డ్యాన్స్ ఉపయోగపడిందని చెప్పింది అర్చన.
‘సామాన్యుడు’ సినిమా షూటంగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను కూడా అర్చన పంచుకుంది. ఫైట్ సీన్ తీస్తుండగా ఒక ఆర్టిస్టు ఆమెకు దగ్గరగా గన్ షూట్ చేశాడట. ఆ సౌండ్‌కి అప్పట్నుండి చెవికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాను అని చెప్పింది. చెవిలో ‘గుయ్..’ మని శబ్దం అప్పుడు వచ్చిందని చెప్పింది. ఇప్పటికీ ఆ సమస్య తనకు ఉంది అంటూ చెప్పుకొచ్చింది అర్చన. అన్నట్లు సినిమాల్లో రీఎంట్రీ కూడా ఇస్తాను అని చెబుతోంది.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!