ప్రముఖ రచయితతో ఫోటోలు దిగిన నటి అర్చన..!

  • December 17, 2022 / 08:06 PM IST

చిన్మయి శ్రీపాద.. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు ఆమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. కేవలం గాయనిగానే కాకుండా. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, రేడియో జాకీ, వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. తెలుగులో ఎక్కువగా సమంతకు తన గొంతును అరువిచ్చారు. అలా సమంతతో చిన్మయికి మంచి అనుబంధం ఉంది. యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వివాహం తర్వాత పర్సనల్ లైఫ్‌తో ప్రొఫెషన్‌ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారామె.

ఇటీవలే కవలలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పిల్లలతోనే సమయం సరిపోతుంది.. సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఒక విషయం మీద కుండబద్దలు కొట్టినట్టు తనదైన శైలిలో స్పందించే చిన్మయి.. ముఖ్యంగా మహిళల విషయంలో స్పందించే తీరు అందరికీ నచ్చుతుంది.. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుకి, చిన్మయికి మధ్య గతకొంత కాలంగా వివాదం నడుస్తుంది.. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో తమిళ చిత్ర సీమలో ఓ కలకలం చెలరేగింది.

ఇక, అప్పటినుంచి ఆమె వైరముత్తును టార్గెట్‌ చేస్తూ పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఓ తమిళ నటి వైరముత్తుని కలవడం గురించి చిన్మయి స్పందించారు.. రెండు రోజుల క్రితం నటి వీజే అర్చన ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా.. అక్కడకు వైరముత్తు వచ్చారు. ఈ నేపథ్యంలో అర్చన వైరముత్తుతో మాట్లాడారు. ఆయనతో ఫోటోలు కూడా తీసుకున్నారు. వైరముత్తు, అర్చన తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు.

ఈ ఫొటోలను అర్చన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.‘‘చూడండి.. నేను షూటింగ్‌లో ఉండగా ఎవరిని కలిశానో’’ అంటూ పోస్ట్ చేయగా ఆ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై చిన్మయి.. ‘‘ఇది ఇలాగే మొదలవుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అతడితో తగినంత దూరాన్ని పాటించు.. నీతో ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా మాత్రం అతడిని కలవొద్దు’’ అని కామెంట్ చేశారు.. చిన్మయి వ్యాఖ్యలపై వీజే అర్చన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus