బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ హీరోయిన్ అయిందా..?

బిగ్ బాస్ సీజన్ 4 లో తనదైన స్టైల్లో గేమ్ ఆడిన బోల్డ్ బ్యూటీ అరియానా ఇప్పుడు సినిమా ఛాన్స్ కొట్టేసింది. గేమ్ లో టాస్క్ లలో ఎగ్రెసివ్ గా దూసుకెళ్లినట్లుగానే కెరియర్ లో కూడా తన మార్క్ చూపించే ప్రయత్నంలో ఉంది ఈ అమ్మడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లుగా ఫోటో పెట్టింది. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్ తర్వాత నా జీవితంలో ఇదొక మంచి రోజు అని, అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి కి థ్యాంక్స్ , రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అంటూ కామెంట్ పెట్టింది. దీన్ని బట్టీ చూస్తుంటే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోస్ కి ట్యాగ్ చేసింది కాబట్టి అన్నపూర్ణ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతోందని అర్ధమవుతోంది. బిగ్ బాస్ తర్వాత అరియానాకి తెలుగులో వచ్చిన ఫస్ట్ అవకాశం ఇదే కావడంతో,

ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన వెంటనే అందరూ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సీజన్ లో టాప్ 5 వరకూ వెళ్లిన అరియానా టాప్ 4 గా ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆమెకి ఇన్ స్ట్రాలో , సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus