యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అరియానా గ్లోరీ ఒకరు కాగా అరియానాకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో ద్వారా అరియానా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. ఒకప్పుడు స్లిమ్ గా కనిపించిన అరియానా బరువు పెరిగి ప్రస్తుతం కొత్త లుక్ లో కనిపిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. కొంతమంది నెటిజన్లు అరియానాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆంటీ అంటూ కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో అరియానా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎలా ఉంటే నీకేంటని నేను నా కెరీర్ పరంగా ఎదుగుతున్నానని నువ్వు అది కూడా లేదు కదా అని ఆమె చెప్పుకొచ్చారు. ధైర్యముంటే ముందుకొచ్చి మాట్లాడాలని నచ్చకపోతే అన్ ఫాలో కొట్టాలని ఆమె తెలిపారు. బ్రెయిన్, హార్ట్ తో ఆలోచించి మాట్లాడాలని అవి లేకపోయినా పరవాలేదని అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటి అని అరియానా కామెంట్లు చేశారు.
అసలు నీకేంటి సమస్య అని ఎవరి జీవితం వాళ్లదని నువ్వేమైనా నా మంత్లీ బిల్స్ పే చేస్తున్నావా అని అరియానా చెప్పుకొచ్చారు. పని పాట లేకపోతే పని చూసుకోవాలని ఆమె కామెంట్లు చేశారు. అసలు తిండి ఎలా పుడుతుంది నీ కడుపుకి? తూ.. అంటూ అరియానా తన పోస్ట్ ను ముగించారు. అరియానా చెప్పింది కూడా నిజమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అరియానా కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అరియానా (Ariyana Glory) ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అరియానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అరియానా రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. కెరీర్ విషయంలో అరియానా మరిన్ని సంచలనాలు సృష్టించాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !