Aadi , Aruna: ఆది సాయికుమార్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అరుణ!

  • May 4, 2023 / 12:04 AM IST

హీరో సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు నటుడు ఆది సాయికుమార్. కెరియర్ మొదట్లో పలు హిట్ సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న ఆది సాయికుమార్ తాజాగా తన భార్య అరుణతో కలిసి వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు అయితే అరుణ తన భర్త గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

ఆది తనని వాళ్ళ అక్క పెళ్లిలో చూశారని అలా తమతో సంబంధం కుదుర్చుకున్నారంటూ తెలియజేశారు.ఆది సాయికుమార్ తో పెళ్లి అనగానే ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన వారు అని మొదట్లో కంగారుపడ్డాను అయితే పెళ్లయిన తర్వాత ఆయన ఎలాంటి లిప్ లాక్ సన్ని వేషాలలో నటించకూడదని తనకు కండిషన్ పెట్టానని అవసరమైతే తప్ప అంటూ ఈమె తెలియజేశారు.

ఇక ఆది (Aadi) పెద్దగా తనకు ఎలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వరని కానీ ఒకసారి మాత్రం ఒక హ్యాండ్ బ్యాగ్ పై మా ఇద్దరి నేమ్స్ ఉండేలా ఏ ఏ అనే లెటర్స్ తో బ్యాక్ డిజైన్ చేయించి నాకు సర్ప్రైజ్ ఇచ్చారని అరుణ తెలియజేశారు. అయితే తనకు ఆది ఎప్పుడైనా ఒక ఆమ్లెట్ వేస్తే తినాలని కోరిక ఉందని తన కోరికను తెలిపారు.అయితే తన కోరిక ఇప్పుడే తీరదని ఆదికి కేవలం కాఫీ పెట్టడం తప్ప ఏమీ రాదు అంటూ అరుణ తెలిపారు.

ఇలా అరుణ తన కోరికను బయట పెట్టడంతో వెంటనే వెన్నెల కిషోర్ అక్కడే ఆది చేత ఆమ్లెట్ వేయించి తన భార్యకు తినిపించారు. ఇలా వెన్నెల కిషోర్ ద్వారా ఆది ఆమ్లెట్ వేసి తన కోరికను తీర్చారు. అయితే ఈ విషయం తెలియడంతో ఇంత చిన్న చిన్న కోరికలు ఉండేవారు కూడా ఉంటారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇక అరుణ ఆది దంపతులకు ఓ కుమార్తె కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus