‘అరుంధతి’ ఫేమ్ దివ్య నగేష్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • February 1, 2021 / 05:23 PM IST

దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ ‘అరుంధతి’ ని ఎవ్వరూ మరిచిపోలేరు. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం.. 2009 సంక్రాంతికి విడుదలయ్యి ఎవ్వరూ ఊహించని కలెక్షన్లను రాబట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ ఈ చిత్రం అప్పటిరోజుల్లోనే 43కోట్ల వసూళ్ళను కొల్లగొట్టడం ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. అనుష్కను స్టార్ హీరోయిన్ ను చేసిన చిత్రమిది. ఇక ఈ చిత్రంలో అనుష్క జేజెమ్మగా అలాగే అరుంధతిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించింది. ఈమె కారణంగా చనిపోయిన అఘోర పాత్రలో సోనూసూద్ నట విశ్వరూపం చూపించాడు.

ఇక ఈ చిత్రంలో చిన్నప్పటి జేజెమ్మ(అనుష్క) గా కనిపించిన చిన్న పాప కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈమె పేరు దివ్య నగేష్. ‘అరుంధతి’ సినిమాలో తన మంచి నటనకు గాను ‘బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్’ గా నంది అవార్డుని కూడా అందుకుంది. ఇప్పుడు ఈమె హీరోయిన్ అయిపోయింది కూడా..! ఇప్పటికే పలు మలయాళం సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో కూడా ‘నేను నాన్న… అబద్దం’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఈమె గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వాటిని చూసి కొందరు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘అరుంధతి’ లో చేసిన చిన్నపాప ఈమేనా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. సరే దివ్య నగేష్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus