Ashish Reddy: అప్పుడే ఆశిష్ రెండో సినిమా..!

  • January 15, 2022 / 04:52 PM IST

నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు రౌడి బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి ఫస్ట్ మూవీ కోసం దిల్ రాజు గత రెండు మూడేళ్ళ నుంచి ఎంతోమంది దర్శకులతో చర్చలు జరిపారు. చిత్ర పరిశ్రమలో పాతికేళ్లకు పైగా అనుభవం ఉన్న దిల్ రాజు మొత్తానికి చాలా ఆలోచించి రౌడీ బాయ్స్ సినిమాను నేడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేశారు. దిల్ రాజు హోమ్ బ్యానర్ లోనే ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించారు.

హుషారు సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హర్ష కొనుగంటి రౌడి బాయ్స్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి మొదటి నుంచి కూడా దిల్ రాజు ఎంతగానో ప్రయత్నం చేశాడు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరి స్టార్ హీరోలను ప్రమోషన్ లో పాల్గొనేలా సినిమాను ప్రమోట్ చేశాడు. ఇక రౌడి బాయ్స్ సినిమా ఏ స్థాయిలో హిట్టవుతుందో తెలియదు గాని దిల్ రాజు మాత్రం తన శక్తి మేరకు అన్న కొడుకును ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని బాగానే ఆరాటపడుతున్నారు.

ఇక ఇటీవల ఈరోజు సమావేశంలో దిల్ రాజు తన సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి రెండో సినిమాని ప్రకటించారు. ‘సెల్ఫిష్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కొత్త దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఇతర నటీనటులు మరియు సిబ్బందికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అన్నారు.

ఇక సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందట. మరి రౌడి బాయ్స్ సినిమాతో ఆశిష్ ఎంతవరకు మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus