Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన అశోక్ గల్లా!

రెండు రోజుల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా భారిన పడినట్టు అధికారికంగా వెల్లడించారు. తనకి కొద్దిపాటి జలుబు వంటి సమస్యలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు మహేష్. అంతేకాకుండా ఇటీవల కాలంలో తనని కలిసిన వాళ్ళందరూ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అతను కోరాడు.మొన్నటి వరకు మహేష్ దుబాయ్ లో ఉండి వచ్చాడు.

అక్కడ కరోనా కేసులు భయంకరంగా పెరిగిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మహేష్ త్వరగా కోలుకోవాలని పూజలు వంటివి చేస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు మహేష్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక ఈ విషయం పై తాజాగా.. అశోక్ గల్లా స్పందించాడు. తన ‘హీరో’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రమోషన్లను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ ఆరోగ్యం పై హీరో అశోక్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి అతను బదులిస్తూ.. “మహేష్ మావయ్య ప్రస్తుతం ఐసొలేషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారు. మైల్డ్ సిమ్ప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. కంగారు పడాల్సిన పని లేదు.ఇంకో రెండు,మూడు రోజుల్లో ఆయన నార్మల్ అయిపోతారు” అంటూ తెలియజేసాడు అశోక్ గల్లా. ఇక ‘హీరో’ చిత్రం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

మరోపక్క మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. మహేష్ లేని సన్నివేశాల్ని అక్కడ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురామ్(బుజ్జి).

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus