NTR30: ఎన్టీఆర్30 మూవీలో ఆ సీరియల్ హీరోయిన్ కు ఛాన్స్ దక్కిందా?

  • May 2, 2023 / 07:59 PM IST

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి అప్ డేట్స్ కోసం రెండు నెలల క్రితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. అప్ డేట్స్ అప్ డేట్స్ అంటూ పదేపదే అడుగుతూ నిర్మాతలపై ఒత్తిడి పెంచొద్దని తారక్ అభిమానులకు సున్నితంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి వారానికి ఒక అప్ డేట్ చొప్పున వస్తుండటం ఫ్యాన్స్ కు ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్30 మూవీలో అష్టాచమ్మా సీరియల్ బ్యూటీ చైత్రా రాయ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా సైఫ్ కు జోడీగా చైత్రా రాయ్ కనిపిస్తారని బోగట్టా. పలు తెలుగు సీరియళ్లలో నటించిన ఈ నటి ఎన్టీఆర్30 సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటే వరుసగా మరిన్ని సినిమాలతో బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

అయితే చైత్ర ఈ సినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరో 18 రోజుల్లో తారక్ పుట్టినరోజు కాగా ఆరోజు తారక్ భవిష్యత్తు మూడు ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తోంది. మెయిన్ రోల్స్ కోసం పాన్ ఇండియా నటులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఎన్టీఆర్30 (NTR30) విడుదలకు మరో ఏడాది సమయం ఉండగా ఈ సినిమాలో మాస్ సీన్లకు, యాక్షన్ సీన్లకు పెద్ద పీట వేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా నిమిషాల్లోనే ఆ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్30 సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus