Ashu Reddy: ఆ యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అషు రెడ్డి… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్!

  • December 16, 2022 / 07:06 PM IST

సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అషు రెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె రెండు సార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ఈమె మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా రాంగోపాల్ వర్మతో కలిసి ఈమె నిర్వహించిన ఇంటర్వ్యూ సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.

ఇలా వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈమె తాజాగా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. టాలీవుడ్ యంగ్ హీరో అరవింద్ కృష్ణ నటిస్తున్న ఏ మాస్టర్ పీస్ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కండ్రగుల శ్రీకాంత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నటువంటి ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ఫోటోషూట్ జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఓల్డ్ ఫోటో షూట్ తో అభిమానులకి పిచ్చెక్కిస్తున్న అశు రెడ్డి వెండితెర హీరోయిన్ గా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus