ChaySam: చైసామ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

Advertisement

అక్కినేని నాగార్జున కొడుకుగా జోష్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య క్లాస్ సినిమాల ద్వారా విజయాలను సొంతం చేసుకుంటూ మజిలీ సినిమాతో ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించారు. లవ్ స్టోరీ సినిమాతో చైతన్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలోని సారంగదరియా పాట బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.

వరుస సినిమాలతో బాగానే సంపాదిస్తున్న చైతన్య ఇప్పటివరకు ఏకంగా 40 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. చైతన్యకు సొంతంగా ఖరీదైన బంగ్లాలతో పాటు కార్లు ఉన్నాయి. అయితే సమంత సంపాదన మాత్రం చైతన్యకు రెట్టింపు కావడం గమనార్హం. సమంత ఆస్తుల విలువ ఏకంగా 85 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. స్టార్టప్ ల ద్వారా కూడా సమంత బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. చైతన్య సమంతల ఆదాయం ఏకంగా 125 కోట్ల రూపాయలని సమాచారం.

తక్కువ సమయంలో చై సామ్ ఈ స్థాయిలో సంపాదించడం గమనార్హం. సమంతకు సొంతంగా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా చైసామ్ దూసుకెళ్తున్నారు. మరోవైపు చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో పాటు థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus