Aswani Dutt: చంద్రబాబు అరెస్టును ఖండించిన అశ్వినీ దత్!

  • September 14, 2023 / 09:35 AM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ కేసులో భాగంగా అరెస్ట్ సంగతి మనకు తెలిసిందే. ఇలా అరెస్టు కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అరెస్టు విషయంపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు .ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మాట్లాడుతూ…

మన దేశానికి గొప్ప రాష్ట్రపతులను ప్రధాన మంత్రులను స్పీకర్లను అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈయనకు ప్రమేయం లేకపోయినా దుర్మార్గ కరంగా అరెస్టు చేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలియజేశారు. ఇలా చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేసే వారికి పుట్టగతులు ఉండవని, చంద్రబాబుపై ఇలా తప్పుడు అబండాలు వేసి జైలుకు పంపించిన వారికి త్వరలోనే సరైన గుణపాఠం చెబుతామంటూ ఈ సందర్భంగా అశ్వినీ దత్ ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 175 సీట్లకు 160 సీట్లను గెలుచుకొని మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అశ్వనీదత్ దీమా వ్యక్తం చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించడమే కాకుండా అధికార పార్టీపై కూడా విమర్శలు చేశారు. అయితే అధికార పార్టీపై విమర్శలు చేయడం అశ్వినీ దత్ కి ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఈయన నంది అవార్డుల విషయంలో కూడా అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

ఉత్తమ రౌడీలు, ఉత్తమ గుండాల కేటగిరిలో అవార్డులు వస్తాయి అంటూ పరోక్షంగా అధికార ప్రభుత్వంపై సెటైర్లు వేయడంతో అప్పుడు కూడా ఈయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Aswani Dutt:

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus