ప్రతివారం బుల్లితెర వేదికపై అందరూ కలిసి ఎంతో సరదాగా నవ్వులు పూయిస్తూ అందరిని నవ్వించే కమెడియన్స్ మధ్య కూడా మనస్పర్ధలు ఉంటాయని, కేవలం కార్యక్రమం కోసమే ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటారని తాజాగా కమెడియన్స్ మధ్య ఉన్న కోపతాపాలు బయటపడ్డాయి. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.
ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి ఆది సాయికుమార్ పాయల్ రాజ్ పుత్ వారి సినిమా తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.ఎప్పటిలాగే ఈ కార్యక్రమం ఆటపాటలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది. అయితే చివరిలో రష్మీ ఒక టాస్క్ నిర్వహించారు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ బుల్లెట్ భాస్కర్ పూర్ణ రష్మీ ఫోటోలను అతికించి పెట్టారు.
ఈ టాస్క్ లో భాగంగా ఎవరైతే ఒక వ్యక్తి వల్ల బాధపడి హర్ట్ అయ్యి ఉంటారో అలాంటి వారి ఫోటోలను చింపేయమని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ వెళ్లి హైపర్ ఆది ఫోటో కాల్చి వేశారు. సారీ అది ఒకానొక సందర్భంలో నువ్వు నన్ను పర్సనల్ గా చాలా హార్ట్ చేసావని చెప్పుకొచ్చారు. మరొక కమెడియన్ కూడా తనని హైపర్ ఆది హార్ట్ చేశారని తన ఫోటో చింపి వేశాడు.
ఇకపోతే చివరిగా రష్మీ సైతం హైపర్ ఆది ఫోటో చింపేస్తూ ఆది ఈ కార్యక్రమానికి వచ్చిన మొదట్లో నన్ను హార్ట్ చేసాడు.ఈ కార్యక్రమానికి యాంకర్ గా రావడంతోనే ఎన్ని రోజులు ఉంటావు అని అడగాల్సింది పోయి ఎప్పుడు పోతావని అడిగి నన్ను అవమానించడంతో నేను హర్ట్ అయ్యాను. అందుకే తన ఫోటో చింపేస్తున్నానని కారణం చెప్పారు.ఇలా అందరూ హైపర్ ఆది ఫోటో చింపి వేయడంతో ఆయన ముఖ కవళికలు ఒక్కసారిగా మారిపోయాయి.ఇక హైపర్ ఆది సైతం ఒక ఫోటో చింపి వేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎవరి ఫోటో చింపి వేశారనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ఈ కార్యక్రమం బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?