విశ్వక్ సేన్ సినిమాకి బాగా కలిసొచ్చేసింది…!

  • February 24, 2020 / 05:52 PM IST

నాని ఓ పక్క మూడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక మరోపక్క సమర్పకుడిగా.. ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతంలో ‘అ!’ సినిమాని నిర్మించి రెండు నేషనల్ అవార్డులను రప్పించాడు నాని. అయితే ఆ చిత్రం కమర్షియల్ గా అనుకున్న రేంజ్లో ఆడలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని విశ్వక్ సేన్ తో ‘హిట్’ అనే చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ప్రశాంత్ తిపిరినేని నిర్మాత. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా బాహుబలి బ్యాచ్ అంతా గెస్ట్ లు గా రావడం విశేషం.

రాజమౌళి, అనుష్క, రానా.. ఈ ముగ్గురూ గెస్ట్ లు గా హాజరయ్యారు. నాని కి రాజమౌళి,రానా లతో మంచి సాన్నిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో ‘ఈగ’ చిత్రంలో కూడా నాని హీరోగా నటించాడు. అయితే రానా, అనుష్క లు కూడా హాజరవడం ఏంటి అన్నది గమనించాల్సిన విషయం. నాని ‘అ!’ చిత్రం ప్రీ రిలీజ్ కు కూడా అనుష్క గెస్ట్ గా వచ్చింది. ఇక రానా కూడా ‘జెర్సీ’ సక్సెస్ మీట్ కు వచ్చాడు. బాహుశా రానా, అనుష్క లతో నాని నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని కూడా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాజమౌళి డైరెక్షన్లో నాని హీరోగా మరో సినిమా చేసే అవకాశం కూడా ఉందనేది మరో ప్రశ్న. మరి వీటి వెనుక అసలు కారణం ఏంటో ఉంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus