తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ పెద్ద ఎత్తున సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లలో బాబు మోహన్ పేరు కూడా ఒకటి అని చెప్పాలి. ఎన్నో సినిమాలలో తన నటనతో అందరినీ మెప్పించినటువంటి ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా పనిచేస్తూ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.
ఈ విధంగా నటుడిగా, మంత్రిగా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తెరపై ఎంతో మందిని నవ్విస్తూ కనిపించారు. కానీ తెర వెనక మాత్రం తన జీవితంలో ఎక్కువ విషాదాలే చోటు చేసుకున్నాయని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాబు మోహన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన కుమారుడి మరణం గురించి మాట్లాడుతూ ఈయన ఎమోషనల్ అయ్యారు.
ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకున్నటువంటి తన కుమారుడు 2009వ సంవత్సరంలో మరణించారు. ఇలా తన కుమారుడు మరణించడంతో తనకు ఏం దిక్కుతోచలేదని తన కుమారుడి మరణ వార్త నుంచి తాను బయటపడలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. కొడుకు మరణం తల్చుకుంటూ బ్రతకలేక తాను కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యాను. కానీ ఇవివి సత్యనారాయణ గారు నన్ను బ్రతికించారని ఈ సందర్భంగా డైరెక్టర్ గురించి ఈయన కామెంట్స్ చేశారు.
దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలను తెరకెక్కించారు అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా బాబు మోహన్ పని చేశారు. ఇక నా కుమారుడు చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అనే విషయం తెలుసుకున్నటువంటి ఈ వివి సత్యనారాయణ గారు నాకు ఎవడి గోల వాడిది సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం బ్యాంకాక్ వెళ్లిన ప్రతిక్షణం ఆయన నన్ను కనిపెట్టుకొని ఉన్నారని, ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే ఈవీవీ సత్యనారాయణ గారే కారణమంటూ ఈ సందర్భంగా (Babu Mohan) బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు