Bachhala Malli Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్  (Amritha Aiyer) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’  (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi)   దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమాకి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది.

Bachhala Malli

ఓపెనింగ్స్ కొంత ఓకే అనిపించినా వీక్ డేస్ లో ఈ సినిమా చేతులెత్తేసింది. ఒకసారి (Bachhala Malli) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.48 cr
సీడెడ్ 0.18 cr
ఉత్తరాంధ్ర 0.24 cr
ఈస్ట్ 0.08  cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.17 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.56 cr (షేర్)

‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా రూ.1.56 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.44 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక బ్రేక్ ఈవెన్ ఛాన్స్ అయితే కనిపించడం లేదు.

 ‘దేవర’ ఎఫెక్ట్‌.. బాబీ మాటలను ఆ సినిమాతో లింక్‌ చేసేశారుగా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus