ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కలవడం జరిగింది. వారితో పాటు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , ‘బలగం’ (Balagam) వేణు (Venu Yeldandi) వంటి అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కూడా రేవంత్ రెడ్డి మీటింగ్ కి హాజరయ్యారు. ఇందులో భాగంగా.. ముఖ్యమంత్రితో ఇండస్ట్రీ బాగోగులకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు రెండున్నర గంటలపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ముచ్చటించినట్టు స్పష్టమవుతుంది.
ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకి అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సాయంగా ఉంటుందని.. రేవంత్ రెడ్డి తెలిపినట్టు సమాచారం. అయితే ఒక విషయంలో మాత్రం సినీ పెద్దలను రేవంత్ రెడ్డి డిజప్పాయింట్ చేసినట్టు స్పష్టమవుతుంది. అదేంటంటే.. సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ వంటివి ఇకమీదట అనుమతించబడవు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారట. అయితే బహిరంగంగా ఏర్పాటు చేసే సినిమా వేడుకలకి ఆయన అభ్యంతరం తెలుపలేదు అని అంటున్నారు.
సంధ్య థియేటర్ ఘటనని ఉద్దేశించి బెనిఫిట్ షోలు వంటి వాటిని రద్దు చేసినట్లు తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలకి అదనపు షోలు, టికెట్ హైక్స్ వంటివి ఇవ్వకపోతే.. ఆ సినిమాలు నిర్మించే నిర్మాతల పరిస్థితి ఏంటి? అంటూ ఈ మీటింగ్ కి వెళ్లిన సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.
దీనిపై మరోసారి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్ రాజు (Dil Raju) మరోసారి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి భారీ బడ్జెట్ సినిమాలని దృష్టిలో పెట్టుకుని చర్చలు జరిపి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టికెట్ హైక్స్ వంటివి లేకపోతే సామాన్యులు హ్యాపీగా ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ లవర్స్ రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలికే అవకాశాలు కూడా ఎక్కువ..!