Dil Raju: సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

ఈరోజు తెలుగు సినీ పెద్దలు… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సినీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని నెగిటివ్ న్యూస్..లు కూడా సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. రేవంత్ రెడ్డితో పాటు lu Arjun) సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా పోలీసులు..

Dil Raju

టాలీవుడ్ పెద్దలకి చూపించి పెద్ద డిబేట్ పెట్టారని, అంతేకాకుండా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వంటివి అనుమతించబడవు అని కూడా రేవంత్ రెడ్డి తెలిపినట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీటిపై పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. తాజాగా వీటిపై దిల్ రాజు (Dil Raju)  స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “సీఎం గారితో జరిగిన మీటింగ్లో అసలు మాట్లాడని వార్తలని కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగింది.

0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ టాపిక్స్ లేవు. సినీ ఇండస్ట్రీకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్స్ వంటి వాటి గురించి అసలు ప్రస్తావన రాలేదు. అది చాలా చిన్న మేటర్. దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరం. సీఎం గారు మాకు చాలా పెద్ద ఛాలెంజ్ పెట్టారు. పోలీసులు సంధ్య థియేటర్ కి సంబంధించి.. మాకు ఎటువంటి వీడియోలు చూపించలేదు.హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకోవాలి.

ఆ రేంజ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేద్దాం అని చెప్పారు.హైదరాబాద్లో ఉన్న ఐటీ, ఫార్మా రంగాలతో సమానంగా సినిమా పరిశ్రమని చూస్తున్నట్టు సీఎం చెప్పారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు. అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని సూచించారు” అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు (Dil Raju) .

జానీ మాస్టర్‌ కొత్త వీడియో రిలీజ్‌… అన్నీ దేవుడికి తెలుసంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus