Bachhala Malli Collections: ‘బచ్చల మల్లి’… నిరాశపరిచిన వీకెండ్ కలెక్షన్స్!

Advertisement

అల్లరి నరేష్ (Allari Naresh)  నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి”(Bachhala Malli). డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి బజ్ ఏర్పడింది. బిజినెస్ కూడా బాగా జరిగింది. కానీ రిలీజ్ తర్వాత ఆ బజ్ ఏమాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు ఓకే అనిపించగా రెండో, మూడో రోజు ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది.

Bachhala Malli Collections:

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.33 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ 0.06  cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.09 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.14 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.08 cr (షేర్)

‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ఈ సినిమా రూ.1.08 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.92 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘పుష్ప 2’.. ఇలా డౌన్ అయిపోయిందేమిటి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus