అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)3 వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే 3వ వీకెండ్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేదు అనే చెప్పాలి. బహుశా 3వ వారంలో కూడా రూ.350,రూ.295 వంటి టికెట్ రేట్లు పెట్టడం ఎందుకు అని సినిమా చూడని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారో ఏమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ లో ‘పుష్ప 2’ కి అనుకున్నదానికంటే బెటర్ గానే పెర్ఫార్మ్ చేస్తుంది.
కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో ఆల్మోస్ట్ క్లోజింగ్ కి వచ్చేసింది. ఒకసారి ‘పుష్ప 2’ 18 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 81.79 cr |
సీడెడ్ | 32.04 cr |
ఉత్తరాంధ్ర | 20.88 cr |
ఈస్ట్ | 11.01 cr |
వెస్ట్ | 8.77 cr |
కృష్ణా | 10.61 cr |
గుంటూరు | 12.74 cr |
నెల్లూరు | 6.64 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 184.84 cr |
కర్ణాటక | 39.75 cr |
తమిళనాడు | 11.90 cr |
కేరళ | 9.97 cr |
ఓవర్సీస్ | 100.45 cr |
నార్త్ | 294.47 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 641.02 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజుల్లో ఈ సినిమా రూ.625.38 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.36.02 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.