మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా కావడంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టీజర్ లాంచ్ ను లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్..లోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాంచరణ్ స్పీచ్ హైలెట్ అయ్యింది.
అతను స్పీచ్ స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రస్తావన తీసుకురావడం అని చెప్పాలి. చరణ్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాను ముందుగా వీక్షించేది ఓవర్సీస్ ప్రేక్షకులే. ఇప్పుడు ఓ తెలుగు సినిమాకి నైజాం మార్కెట్ ఎంత ముఖ్యమో.. ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పెట్టినప్పుడే కొత్తగా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యాం. ‘గేమ్ ఛేంజర్’ లో నేను చేసిన అప్పన్న పాత్ర చాలా ఎథిక్స్ తో కలిగి ఉంటుంది.
ఇప్పటివరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ‘గేమ్ ఛేంజర్’ ని మేము సంక్రాంతికి అనుకోలేదు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డేట్ కి రావాల్సి వస్తుంది. మాకు సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) గారికి, యూవీ క్రియేషన్స్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. అయితే అదే టైంలో అభిమానులు ఓజీ ఓజీ (OG Movie) అంటూ గట్టిగా అరిచారు.
అప్పుడు చరణ్ ‘ ఓజీ కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా ‘గేమ్ ఛేంజర్’ కనుక లేకపోతే.. కళ్యాణ్ (Pawan Kalyan) బాబాయ్ ని ఫోర్స్ చేసి అయినా సరే ‘ఓజీ’ ని పూర్తి చేయించి సంక్రాంతికి మీ ముందుకు తెచ్చేవాళ్ళం’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత దిల్ రాజు (Dil Raju) గురించి చెబుతూ.. ‘ఇందులో అన్నీ ఇరుక్కు(నవ్వుతూ), డాన్స్ ఫైట్స్ మాత్రమే కాదు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని కూడా క్లారిటీ ఇచ్చేశాడు చరణ్.