టాలీవుడ్లో ఉన్న కొంతమంది యంగ్ బ్యూటీస్లో.. కథకి, పాత్రకి న్యాయం చేసే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని ప్రామిసింగ్ హీరోయిన్లుగా ముద్ర వేసుకున్న వారు ఉన్నారు. మాళవిక నాయర్…కూడా అందులో ఒకరు. ఈమె మంచి అందగత్తె కూడా.! ఎలాంటి పాత్రకైనా తన నటనతో జీవంపోయగలదు. అది ఎంత టఫ్ రోల్ అయినా సరే సమర్ధంగా అర్ధం చేసుకుని నటించగల హీరోయిన్. అయితే ఎంత టాలెంట్ ఉన్నా.. లక్ కూడా కలిసిరావాలి. ఈ అమ్మడికి అదే మైనస్ అవుతుంది.లక్ అనేది ఆమెకు కిలోమీటర్ దూరంలోనే ఆగిపోతుంది.
గతంలో ఈమె (Malvika Nair) సెకండ్ హీరోయిన్ గా చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ ‘టాక్సీ వాలా’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ సోలో హీరోయిన్ గా చేసిన ‘కళ్యాణ వైభోగం’ ‘విజేత’ ‘ఫలానా అబ్బాయి ఫలానా’ అమ్మాయి వంటి చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
గ్లామర్ షో చేయడానికి కూడా ఈ అమ్మడు సిద్ధపడింది. కానీ ఎక్కడో తేడా కొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మలయాళం, తమిళ భాషల నుండి అవకాశాలు వచ్చినా ఈమె నటించడానికి సిద్ధంగా లేదు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అనే పద్దతిని ఈమె ఫాలో అవ్వాలి అనుకుంటుంది.
ఇక్కడ సక్సెస్ అయ్యాక అటు వైపు దృష్టి పెడుతుందట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘డెవిల్’ లో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఆ సినిమా అయినా ఈమె కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!