టాలీవుడ్ స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలంతా ఈ పెళ్లి సీజన్‌లో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. కొంతమంది నిశ్చితార్థ కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు.. ఈమధ్య సెలబ్స్ వరుసగా గుడ్ న్యూస్‌లు చెప్తూ.. ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే ఓంకార్ అన్నయ్య తమ్ముడు అశ్విన్ బాబు లగ్జరీ కార్ కొన్నాడు.. స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది.. ఇప్పుడు బాలనటుడిగా, కథానాయకుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలాదిత్య తన కుమార్తెకు నామకరణ వేడుక చేశారు..
బాలాదిత్య బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చారు.. దీంతో పేరు పెట్టే కార్యక్రమం నిర్వహించడానికి కుదర్లేదు.. డిసెంబర్ 15న మంచి రోజు కావడంతో ఈ వేేడుక నిర్వహించారు. పాపకు ‘యజ్ఞ విధాత్రి’ అని నామకరణం చేశారు. బిగ్ బాస్ 6 లో బాలాదిత్యతో పాటు పాల్గొని, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు.. ప్రస్తుతం బాలాదిత్య కుమార్తె నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!