బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే సంగతి తెలిసిందే. బాలయ్య కోసం అనిల్ రావిపూడి ఇప్పటికే పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న కథలో అదిరిపోయే ట్విస్టులు కూడా ఉండటంతో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
30 సంవత్సరాల వయస్సులో ఆవేశంలో చేసిన గొడవల వల్ల హీరో 14 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవిస్తారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూతురు వల్ల హీరో జీవితంలో మార్పులు వస్తాయని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రస్తుతానికి సంబంధించిన సన్నివేశాలు మాత్రం కామెడీతో ఉంటాయని సమాచారం అందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. ఈ సినిమాలో బాలకృష్ణ కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.
సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని బోగట్టా. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారని బాలయ్య నుంచి అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో అలా ఈ సినిమా ఉండనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. టర్కీలో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉండగా త్వరలో ఈ షెడ్యూల్ మొదలుకానుంది.
బాలయ్య తన సినిమాలు మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్య కెరీర్ విషయంలో ప్రస్తుతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?