Balayya Babu: వీరసింహారెడ్డి విషయంలో బాలయ్య చేస్తున్న పొరపాటు ఇదే!

ఈ మధ్య కాలంలో టీవీ, ఓటీటీ షోలలో ఏ షోకు దక్కని స్థాయిలో అన్ స్టాపబుల్ షోకు ఆదరణ దక్కింది. తన ప్రతిభతో సీజన్1 ను సక్సెస్ చేసిన బాలయ్య ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లతో సీజన్1 ను మించి సీజన్2 ను సక్సెస్ చేయబోతున్నారని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారమవుతోంది.

బాహుబలి ఎపిసోడ్ పార్ట్1 ది బిగినింగ్, బాహుబలి ఎపిసోడ్ పార్ట్2 ది కంక్లూజన్ పేర్లతో ఈ రెండు ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయని సమాచారం అందుతోంది. డిసెంబర్ నెల 30వ తేదీన ఒక ఎపిసోడ్ జనవరి నెల 6వ తేదీన మరో ఎపిసోడ్ ప్రసారం కానున్నాయి. అయితే అన్ స్టాపబుల్ షో సీజన్ 2లో వీరసింహారెడ్డి ప్రమోషన్స్ కు సంబంధించి ఒక ఎపిసోడ్ ను ప్లాన్ చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ కు ముందే ఈ ఎపిసోడ్ ప్రసారమై ఉంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉండేది. అయితే అన్ స్టాపబుల్ షో నిర్వాహకుల ప్లానింగ్ ప్రకారం వీరసింహారెడ్డి రిలీజ్ కు ముందు ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే ఛాన్స్ లేదు. మరోవైపు వీరసింహారెడ్డి ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ఎపిసోడ్ ను సింగిల్ ఎపిసోడ్ గా రిలీజ్ చేసి జనవరి 6వ తేదీన వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ ను శృతి హాసన్, గోపీచంద్ మలినేని గెస్ట్ లుగా ప్రసారం చేసి ఉంటే బాగుండేది.

ఈ విధంగా ప్లానింగ్ చేయడంలో బాలయ్య ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరసింహారెడ్డి మూవీ నుంచి మరో రెండు సాంగ్స్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగకు వీరసింహారెడ్డి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ నమ్మకాన్ని బాలయ్య నిజం చేస్తారేమో చూడాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus