Balakrishna , Boyapati Sreenu: బోయపాటి శ్రీను కాంబో సినిమాలో విలన్ అతనేనా?

  • June 6, 2024 / 11:54 AM IST

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఎన్నో సినిమాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. బాలయ్యను పర్ఫెక్ట్ గా చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రమేనని చాలామంది భావిస్తారు. బాలయ్య సినిమాలలో ఈ మధ్య బాలీవుడ్ విలన్స్ ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

బాలయ్య సంజయ్ దత్ (Sanjay Dutt) కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. రెండు రంగాల్లో బాలయ్య ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మూవీ గురించి త్వరలో అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.

సాధారణంగా బాలయ్య తన సినీ కెరీర్ లో సీక్వెల్స్ లో నటించిన సందర్భాలు దాదాపుగా లేవు. అయితే అఖండ (Akhanda) తర్వాత బాలయ్య కూడా తన హిట్ సినిమాల సీక్వెల్స్ పై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయ్యి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus