Jr NTR: చంద్రబాబు, పవన్ కళ్యాణ్..ల విజయం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన.!

  • June 5, 2024 / 06:10 PM IST

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఏపీలో కూటమి సునామి సృష్టించింది. టీడీపీ 160 స్థానాల్లో చారిత్రాత్మక విజయం సాధించగా..మరోవైపు జనసేన పార్టీ కూడా 21 కి 21 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. సంక్షేమ పథకాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధికే జనాలు మొగ్గు చూపినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)మాత్రం స్పందించలేదు. చాలా కాలంగా ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఈ విషయంలో నందమూరి అభిమానులు సైతం ఎన్టీఆర్ పై విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు ఉన్నాయి. అన్నీ ఎలా ఉన్నా.. నిన్న టీడీపీ ఘన విజయం సాధించినా ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండటం పై చాలా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా టీడీపీ విజయం పై ఎన్టీఆర్ స్పందించడం జరిగింది. ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..

” ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ (Balakrishna) బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ మతుకుమిల్లికి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus