Pushpa 2: రీషూట్లు చేస్తున్నారా లేదా ‘పుష్ప’… ‘రైజ్‌’లాగా చేయొద్దు ప్లీజ్‌

సినిమా అన్నాక షూట్లు ఎంత కామనో, రీషూట్లూ అంతే కామన్‌. అయితే సుకుమార్‌ (Sukumar) లాంటి దర్శకుడికి ఇంకా కామన్‌. సినిమా అంతా అయిపోయినా.. రిలీజ్‌ ముందు రోజు క్యూబ్‌కి ఫుటేజ్‌ పంపిచడానికి ముందు కూడా ఆయన ఎడిటింగ్‌ టేబుల్‌ మీద ఏవో మార్పులు చేస్తూనే ఉంటారు. ఇదేదో గాలి మాట కాదు.. ఆయన టీమ్‌ చెప్పే మాటే. ఏం చేసినా పర్‌ఫెక్ట్‌ పిక్చర్‌ వచ్చేలా చూడటం ఆయనకు అలవాటు. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) విషయంలోనూ అదే జరుగుతుందా? ఈ విషయం మీదే డౌట్స్‌ రెయిజ్‌ అవుతున్నాయి.

ఈసారి కూడా ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa: The Rise) పరిస్థితి రాకూడదు అని చాలా రోజులుగా అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫ్యాన్స్‌ కోరుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమా సమయంలో దర్శకుడు సుకుమార్‌ ప్రచారానికి అందుబాటులో లేరు. సినిమా ప్రచారం మొత్తం అల్లు అర్జున్‌ – రష్మిక (Rashmika Mandanna) మందన మీదనే జరిగింది. దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాలకు వెళ్లి సినిమా ప్రచారం చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) కూడా వారితోనే ఉన్నారు. ఆఖరులో ఒకట్రెండు రోజుల ముందు సుకుమార్‌ బయటికొచ్చారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే సినిమా రిలీజ్‌కు ఇంకా సుమారు 50 రోజులు ఉంది. అయితే రీషూట్లు జరుగుతున్నాయని టాక్‌ నడుస్తోంది. కొన్ని సన్నివేశాల విషయంలో సుకుమార్‌ టీమ్‌, అల్లు అర్జున్‌ సంతృప్తిగా లేరట. దీంతో మరోసారి యాక్షన్‌ చెప్పాలని, యాక్ట్‌ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే జరిగితే.. సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందా అనే ప్రశ్న వినిస్తోంది. అయితే రీషూట్లు కొన్నిసార్లు సినిమాకు బాగా ఉపయోగపడుతుంటాయి.

తెలుగులో చాలా సినిమాలు ఇలా రీషూట్లు జరుపుకుని భారీ విజయాలు అందుకున్నాయి. సుకుమార్‌ సినిమాలు మరీనూ. అయితే సినిమాకు సంబంధించి ఏమైనా పుకార్లు వస్తే.. ‘పుష్ప’ టీమ్‌ నవ్వే సమాధానంగా ఇస్తోంది. మరి ‘రీషూట్‌’ రూమర్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నట్లు ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి హిట్‌ కొట్టిన టీమ్‌.. మూడో పాట త్వరలో రిలీజ్‌ చేస్తుందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus