Balakrishna: బాలయ్య మూవీపై భారీగా అంచనాలు.. కానీ..?

  • April 10, 2021 / 08:42 AM IST

2017 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరువాత బాలకృష్ణ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాతో బాలకృష్ణ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

శివరాత్రికి ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వస్తుందని భావించిన బాలకృష్ణ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ఉగాది పండుగకు ఈ సినిమా టైటిల్, అప్ డేట్స్ వస్తాయని బాలకృష్ణ ఫ్యాన్స్ భావించినా సినిమాకు అప్ డేట్స్ కు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వెలువడటం లేదు. ఆచార్య సినిమా నుంచి వరుసగా పాటలు విడుదలవుతుంటే బాలయ్య సినిమా సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న గాసిప్స్ పై స్పందించి బీబీ3 మేకర్స్, దర్శకుడు పుకార్లకు చెక్ పెట్టాల్సి ఉంది. సినిమాకు సంబంధించి అప్ డేట్స్ లేకపోవడంతో బోయపాటిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus