Balakrishna: ఆ సెంటిమెంట్ పై దృష్టి పెట్టిన బాలకృష్ణ!

  • May 8, 2023 / 02:54 PM IST

63ఏళ్ల నందమూరి బాలకృష్ణ ప్రస్తుత కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస హిట్లు అందుకున్న బాలయ్య ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బాలయ్య బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య సినిమాల విషయంలో ఒక సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటాడు. అలాగే ఆయన అభిమానులకు కూడా బాలయ్య సినిమాల విషయంలో చాలా సెంటిమెంట్లు ఉన్నాయి.

బాలయ్య సినిమాకి కచ్చితంగా టైటిల్ లో సింహ అనే పేరు ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. అంతేకాకుండా విగ్గుల విషయంలో కూడా బాలయ్య అభిమానులకు సెంటిమెంట్ ఉంది. బాలయ్య ఒక్కో సినిమాలో ఒక్కో తరహా గెటప్ లో కనిపిస్తారు. ఇలా వేర్వేరు విగ్గులను వాడటం వల్ల సినిమా సినిమాకు బాలయ్య లుక్ మారిపోతుంది. బాలయ్యకు విగ్గు సెట్ అయితే ఆ సినిమా హిట్ అవుతుందని అభిమానుల నమ్మకం.

ఎందుకంటే ప్లాప్ అయినా సినిమాలలో బాలయ్యకు విగ్గు సెట్ అవ్వలేదు. అయితే బాలయ్యకి విగ్గు సెట్ అయిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. దీంతో బాలయ్య కూడా తన లుక్కు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రెండ్ కు అనుగుణంగా బాలయ్య తనని తాను ఎప్పుడు మార్చుకుంటూనే ఉంటాడు. అంతేకాకుండా బాలయ్య సినిమాల విషయంలో మరొక సెంటిమెంట్ కూడా ఉంది. స్టార్ స్టేటస్ ఉన్న దర్శకులతో చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి.

అందువల్ల బాలయ్య తరచూ స్టార్ దర్శకులతోనే సినిమా చేయటానికి ఆసక్తి చూపుతాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై కూడా అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus