Balakrishna, Prakash Raj: ముఖం పక్కకు తిప్పుకున్న బాలయ్య.. ఏమైందంటే?

స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా ప్రకాష్ రాజ్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన సమయంలో బాలకృష్ణ ప్రకాష్ రాజ్ కు భారీ షాక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ నమస్కారం పెట్టగా బాలకృష్ణ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. బాలకృష్ణ పట్టించుకోకుండా ముఖం పక్కకు తిప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బాలకృష్ణ ఈ ఎన్నికల్లో విష్ణుకు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రత్యక్షంగా విష్ణుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించకపోయినా బాలకృష్ణ చాలా సందర్భాల్లో విష్ణుకు అనుకూలంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ విష్ణుకు మద్దతు ఇస్తుండటం వల్లే ప్రకాష్ రాజ్ వంగి నమస్కారాలు పెడుతున్నా పట్టించుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మీడియాతో మాత్రం బాలకృష్ణ విష్ణు, ప్రకాష్ రాజ్ గురించి పాజిటివ్ గా చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి ప్రకాష్ రాజ్, విష్ణు అన్నాదమ్ములలాంటి వాళ్లని ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదని బాలకృష్ణ తెలిపారు.

మోహన్ బాబు కుటుంబానికి బాలయ్య సన్నిహితుడనే సంగతి తెలిసిందే. ఆ రీజన్ వల్లే విష్ణుకు బాలయ్య మద్దతు ఇచ్చారు. త్వరలో బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు మంచు ఫ్యామిలీ అతిథులుగా హాజరు కానున్నారని తెలుస్తోంది. క్రిష్ ఈ షోకు నేతృత్వం వహిస్తారని వార్తలు వచ్చినా ప్రశాంత్ వర్మ ఈ టాక్ షోకు నేతృత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుందని సమాచారం. ఈ షో ప్రోమో కోసం బాలకృష్ణ గుర్రం ఎక్కినట్టు తెలుస్తోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus