మెగాస్టార్ హ్యాండివ్వడంతో బాలయ్యను నమ్ముకున్నాడు..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ చిత్రాలతో బాలయ్య 103, 104 చిత్రాలు పూర్తవుతాయి. ఇక వీటి తరువాత బాలయ్య ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ లిస్ట్ లో బోయపాటి పేరు వినిపించింది.తరువాత అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది. తాజాగా ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.

ఆ డైరెక్టర్ ఎవరో కాదు కొరటాల శివ. కొరటాల శివ కూడా బాలకృష్ణ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. అయితే మొదట ఈ కథ మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని కొరటాల రాసుకున్నాడట. అయితే ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న చిరు.. తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించేశాడు. అయితే ఇప్పుడు ఆ కథకు సరిపడే హీరో ఒక్క బాలయ్య మాత్రమేనని.. కొరటాల బాలయ్యని సంప్రదించినట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. మరి ఈ ముగ్గురి డైరెక్టర్లలో ఎవరితో బాలయ్య తన నెక్స్ట్ సినిమా చేస్తాడో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus