భారీ సాయంతో పెద్ద మనసుచాటుకున్న బాలయ్య!

  • August 26, 2020 / 03:16 PM IST

సాయంలో తన చేతిక ఎముక లేదని బాలయ్య నిరూపించుకుంటున్నారు. ఆయన వరుసగా దానాలు చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. హిందూ పురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఈనెల 29 మరియు 30 తేదీలలో ఆ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సంధర్భంగా ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ సెంటర్ లో ఉన్న రోగులు మరియు సేవలు అందిస్తున్న సిబ్బందికి 55లక్షల విలువ చేసే పరికరాలు, మాస్కులు, పిపిఈ కిట్లు అందించనున్నారు.

గతంలో సినీకార్మికుల సహాయార్థం ఏర్పాటు చేసిన సీసీసీ కోసం బాలయ్య 25లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు 50లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా ఆపదలో ప్రజలను ఆదుకుంటూ బాలయ్య కలియుగ కర్ణుడు అయ్యాడు. కాగా బాలయ్య ప్రస్తుతం దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు.

లాక్ డౌన్ ముందు వరకు నిరవధికంగా షూటింగ్ జరిగింది. ఇక ఈ మూవీకి టైటిల్స్ గా మోనార్క్, సూపర్ మేన్, మొనగాడు, బొనాంజా అనే అనేక టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ భారీ ప్రచారం దక్కించుకుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus