Balakrishna: ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ!

ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు తెరకెక్కి సక్సెస్ సాధించాయి. భవిష్యత్తులో కూడా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని తర్వాత సినిమా బాలయ్య హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు రవితేజ, గోపీచంద్ మలినేని గెస్టులుగా హాజరు కాగా రవితేజను ఆరు నెలలు కలవవద్దని గోపీచంద్ మలినేనికి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు.

గోపీచంద్ మలినేని రవితేజను తాను తరచూ కలుస్తూ ఉంటానని ఈ షోకు హాజరు కావడానికి రెండు రోజుల ముందు కూడా కలిశానని చెప్పుకొచ్చారు. గోపీచంద్ మలినేని అలా చెప్పడంపై బాలయ్య స్పందిస్తూ మీ మునుపటి మూవీ హీరోను ఎందుకు కలవాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అవసరమైతే మీ కాబోయే హీరోను కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందిచొచ్చంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. వచ్చే ఆరు నెలలు రవితేజను కలవవద్దని తనను మాత్రమే కలవాలని బాలయ్య గోపీచంద్ మలినేనికి సూచనలు చేశారు.

మనం కలిసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాతే మీరు అతన్ని కలవాలి అంటూ బాలకృష్ణ గోపీచంద్ మలినేనికి వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య అలా చెప్పడంపై రవితేజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్, మీరు గోపీచంద్ మలినేనిని నా వద్దకు పంపవద్దని నేనే అతడిని కలవడానికి మీ సెట్స్ కు వస్తానని చెప్పానని రవితేజ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాలయ్య రవితేజ గొపీని ఎక్కడైనా కలవచ్చని కామెంట్లు చేశారు.

మరోవైపు రవితేజ ఈ షోలో తన వెనుక రాజకీయాలు జరిగాయని కామెంట్లు చేశారు. అయితే రాజకీయాలు చేసిన వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం రవితేజ వెల్లడించలేదు. అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయని ఇప్పుడు వాటిని లైట్ తీసుకుంటానని రవితేజ కామెంట్లు చేశారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus